Jammu and Kashmir: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Nov 17,2023 12:54 #encounter, #Jammu and Kashmir

 

కుల్గామ్‌ : భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారని శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఇంకా సరిహద్దు వెంబడి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు ధృవీకరించారు. జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో డిహెచ్‌ పోరా ప్రాంతంలోని సామ్నో పాకెట్‌ వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగిందని, ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్‌, 9 పారా (ఎలైట్‌ స్పెషల్‌ ఫోర్స్‌ యూనిట్‌), పోలీసులు, సిఆర్‌డిఎఫ్‌ సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఉరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని నవంబర్‌ 15వ తేదీ బుధవారం ‘ఆపరేషన్‌’ కలి పేరుతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మట్టుబెట్టారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇదే తరహా ఘటన చోటుచేసుంది. ఉగ్రవాదులు అక్రమంగా నియంత్రణరేఖను దాటి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. వీరినే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కి చెందిన బషీర్‌ అహ్మద్‌ మాలిక్‌ అనే కీలక ఉగ్రవాదిని చంపినట్లు భారత సైన్యం వెల్లడించింది.

➡️