జాతీయ నమూనా రూపొందించాలి : పాఠశాలల్లో బాలికలు, మరుగుదొడ్ల నిష్పత్తిపై కేంద్రానికి సుప్రీం ఆదేశం

supreme court serious on kerala governor

 

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాఠశాలల్లో బాలికలు, మరుగుదొడ్ల సంఖ్య నిష్పత్తికి సంబంధించి జాతీయ నమూనాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శానిటరీ న్యాప్‌కిన్‌ల పంపిణీకి అనుసరించాల్సిన పద్ధతుల విషయంలో ఏకరూపతను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది.జాతీయ రుతుక్రమ పరిశుభ్రత విధానం-2023 ముసాయిదాను ఖరారు చేసే ముందు దేశంలోని ప్రభుత్వ-ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థినులు, బాలికల మరుగుదొడ్ల సంఖ్య నిష్పత్తికి సంబంధించి జాతీయ నమూనాను రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. పాఠశాలల్లోని విద్యార్థినులకు తగినన్ని శానిటరీ నాప్‌కిన్‌లు అందుబాటులో ఉండేలా చూసేందుకు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.

➡️