గ్రూపు 2 స్టడీ మెటిరియల్ పంపిణీ

Dec 2,2023 13:19 #KVPS, #PDF MLC, #Service Sector
kvps free group 2 material distribution

ప్రజాశక్తి-విజయవాడ : ప్రభుత్వరంగ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు గ్రూపు 2 స్టడీ మెటిరియల్ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తయారు చేసిన ఉచిత పుస్తక పంపిణీ విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్ద గల మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కె.వి.పి.ఎస్) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంధ్భంగా జరిగిన అవగాహన సభకు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పూలే, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ [PAVKCT] ఛైర్మన్ ఆండ్ర మాల్యాద్రి పెద్దలను వేదికపైకి ఆహ్వానిస్తూ దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై పోరాడుతూ మహానీయులు మహాత్మ ఫూలే , అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య, సావిత్రి భాయి పూలే ఆలోచన, ఆశయాలను కె.వి.పి.ఎస్ ముందుకు తీసుకుపోతుందన్నారు. సభకు జి ఆర్ కె పోలవరపు కళా సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా పుస్తకాలను తీసుకువెళ్లి బాగా చదువుకోవాలన్నారు.
గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తయారు చేసిన స్టడీ మెటిరియల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సివిల్ సప్లయ్ ఎండి ఐఏఎస్ జి వీర పాండ్యన్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత అందరికీ స్థిరమైన లక్ష్యాలు ఉండాలన్నారు. రకరకాల పుస్తకాలు చదివే కన్నా ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలిపారు. సమాజ అవగాహన ఉండాలన్నారు. పట్టభద్రుల శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నేటి పరీక్షలు ప్రశ్న సరళి మార్కుల గురించి వివరించారు. పరీక్షలకు మారిన సిలబస్ గురించి విద్యార్థులకు వివరించారు.
ఏసీపీ సౌత్ జోన్ విజయవాడ డాక్టర్ బి రవి కిరణ్ మాట్లాడుతూ గ్రూప్ వన్ లో 12వ ర్యాంక్ సాధించడానికి తాను ప్రయాణించిన విధానాన్ని ఔత్సాహికులకు వివరించారు. తాను డాక్టర్‌ గా పనిచేస్తూ ఏ విధంగా పోటీ పరీక్షలు సిద్ధపడ్డారో ఔత్సాహకులకు తెలియజేసి స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం తాను మాట్లాడుతున్నట్టే రానున్న కాలంలో అభ్యర్ధులు కూడా స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడతారని బలంగా నమ్ముతున్నానని అన్నారు. యువతను ఉత్సాహపరుస్తూ స్ఫూర్తి నింపారు.
ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ (PAVKCT) విజయవాడ కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిరోధిక సమస్యలు తీర్చడానికి స్థిరమైన ప్రణాళికతో వెళ్లాలన్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలన్నీ ప్రకటించాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో పోస్టులు విడుదల చేయాలన్నారు. నేటి యువతలో పూలే, అంబేద్కర్ లను తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు స్ఫూర్తిని ఉత్సాహాన్ని నింపడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందన్నారు.
సిద్ధార్థ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మన్నం రాజారావు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ పట్టుదలతో కృషి చేస్తే తప్పక లక్ష్యాలు సాధిస్తారు.
మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ లెనిన్ బాబు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే సృజనాత్మతో పాటు షార్ట్ కట్స్ కూడా తెలిసి ఉండాలని అన్నారు.
ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు బి తులసిరావు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(KVPS) రాష్ట్ర సహాయ కార్యదర్శి జి నటరాజు, జాబ్స్ కో ఆర్డినేటర్ సుమలత, విక్రం తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ఔత్సాహికులు యువతీ, యువకులు పాల్గొన్నారు.

➡️