వైసిపిని ఇంటికి సాగనంపాలి : డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి – కనిగిరి : అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గుల గొంది కాలనీ, మండల పరిధిలోని బల్లిపల్లిలో మన ఊరు-మన ఉగ్ర, బాబు ష్యూరిటీ, భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధి మరిచి ప్రజలను ఇబ్బంది పెట్టేలా పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి ,షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, తమ్మినేని వెంకట్‌ రెడ్డి, కాసు హరికష్ణ రెడ్డి, పిచ్చాల శ్రీనివాసులు రెడ్డి, తమ్మినేని సురేంద్రరెడ్డి, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి.నారాయణ, సత్యం పాల్గొన్నారు.

➡️