ప్రజాశక్తి-హనుమంతునిపాడు : కందుకూరు నుంచి పెద్ద చెర్లోపల్లి, కనిగిరి, హనుమంతుడుపాడు మీదుగా కంభం, బేస్తవారిపేట రోడ్డును కలుపుతూ నిర్మించిన డబల్ రోడ్డు మూన్నాళ్ళ ముచ్చటగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పొన్నలూరు నుంచి పెదచెర్లోపల్లి మండలం అలవలపాడు, ఎబిఆర్ కాలేజీ వరకూ రహదారిపై గుంతలు ఏర్పడినట్లు తెలిపారు. అలవలపాడు వద్ద పాలేటి వాగుపై నిర్మించిన బ్రిడ్జి, రామాపురం బస్టాండ్ సెంటర్ ప్రాంతాల్లోనూ రహదారిపై గుంతలు ఏర్పడినట్లు ఆయన తెలిపారు. దీంతో రాపోకలు సాగించేందుకు వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించిన రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.