తర్లుపాడు : ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తే ఎప్పటికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ నరసింహులు అధ్యక్షతన ఇఒఆర్డి అమరేశ్వర రావు ఉద్యోగ విరమణ సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి భూలక్ష్మి మాట్లాడుతూ ఇఒఆర్డి అమరేశ్వర రావు క్రమశిక్షణ, పట్టుదల, సత్ ప్రవర్తన కలిగి, అంకితభావంతో తమ వత్తిని సజావుగాకొనసాగించారని తెలిపారు. నిబద్ధతతో పనిచేసి అందరి మన్ననలు పొందాడని కొనియాడారు. అనంతరం అమరేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహులు, ఎంఇఒ దేవరకొండ సుజాత, ఎపిఎం పిచ్చయ్య. సెక్రటరీలు కాలంగి శ్రీనివాసులు, వై.గీత, జె. పద్మ, అచ్యుతరావు, కాశయ్య, తిరుపాలు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.