ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి నియోజవకర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి
శాశ్వత భూహక్కు పట్టాలు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం పట్టాలను నియోజవకర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆల్ ఖేర్ ఫంక్షన్ ఉదయగిరి, సీతారాంపురం మండలాలకు శాశ్వత భూహక్కు సెటిల్‌మెంట్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో యేళ్లుగా పరిష్కారం గానీ చుక్కల భూములపై సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. మండలంలో 245మంది రైతులను గుర్తించి 360 ఎకరాలకు శాశ్వత భూ హక్కు కల్పించి వారి కుటుంబాలకు భరోసాగా జగన్ ప్రభుత్వం నిలిచిందన్నారు. రైతు పక్షపాతిగా రైతాంగానికి పెద్దపీట వేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందుకు నిదర్శనమే ఈ శాశ్వత భూ హక్కు కల్పించడమేనని జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు తెలిపారు. సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి కాక చెప్పనవేకాక మరెన్నో పథకాలను ప్రజలకు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని 2024లో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సానా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా జెడ్‌పి కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, సర్పంచ్ సామ్రాజ్యం, మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డ్ డైరెక్టర్ ఎస్థాని, సాహిత్య అకాడమీ డైరెక్టర్ అక్కి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ ముత్తుజ హుస్సేన్, మాజీ ఎంపిటిసి ఉప్పుటూరి హరి, సర్పంచ్ గౌస్ మొహిద్దీన్, మాజీ కన్వీనర్ మూలే సుబ్బారెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.