ఫొటో : పట్టాలు అందజేస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
సాగుభూమి పట్టాలు అందజేత
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలో 20యేళ్లుగా సాగులో ఉన్న భూములకు సంబంధించిన పట్టాలను శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి రైతులకు పట్టాలు అందజేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని తెలిపారు. 20 యేళ్లుగా రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి పట్టాలను మంజూరు చేసేందుకు జగన్మోహన్రెడ్డి కృషి చేశాడని పేర్కొన్నారు. పట్టాలు రాని వారు ఉంటే స్థానిక అధికారులను సంప్రదిస్తే అర్హులైన వారికి త్వరితగతిన పట్టాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సిఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి గవదకట్ల వెంకటలక్ష్మమ్మ, మండల కన్వీనర్ మందలపు తిరుపతినాయుడు, మాజీ ఎఎంసి అలీ అహ్మద్, సొసైటీ చైర్మన్ గుంటుపల్లి రామాంజనేయులు, సర్పంచ్ కొండెపోగు దిలీప్‌కుమార్, వైస్ ఎంపిపి చెంచల మధు, తహశీల్దారు ఎన్ మల్లికార్జున్‌రావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాగంటి శ్రీనివాసులు, సచివాలయాల కన్వీనర్ బొడ్డు వెంకటేశ్వర్లు, కోఆప్షన్ సభ్యులు జిలాని, తదితర వైసిపి నాయకులు, రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.