అభివృద్ధిలో ధర్మవరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే

Dec 1,2023 22:09

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కి నిర్మాణ పనుల శిలాఫలకం ఆవిష్కరణ

          ధర్మవరం టౌన్‌ : అభివృద్ధిలో ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలుపుతామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక శివానగర్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.50 కోట్ల వ్యయంతో కదిరిగేట్‌ నుండి మార్కెట్‌ యార్డు వరకు నూతనంగా నిర్మించబోయే ఫోరైన్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం సేతుబందన్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా 9 ఆర్‌ వోబీలు మంజూరు చేస్తే అందులో ధర్మవరం ఆర్వోబీ ఒకటి అన్నారు. ఇందుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.30కోట్లు నిధులు ఆర్‌వోబీ కింద ఇళ్లు కోల్పోయేవారికి భూసేకరణ చట్ట కింద మంజూరు చేసిందన్నారు. మొత్తం 900మీటర్ల పొడవున ఫోర్న్‌ ఆర్‌ వోబీని నిర్మించడం జరిగిందని ఇందుకు సంభందించి బెండర్ల ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఆర్‌ వోబీ నిర్మాణంలో భాగంగా 132మంది నిర్వాసితులకు గానూ 65 మందికి పరిహారం అందించడం జరిగిందని, 25 మందికి త్వరలోనే పరిహారం అందించేలాగా సీఎఫ్‌ఎంఎస్‌ చేయడం జరిగిందని అన్నారు. మరికొంత ఆర్వోబీ వద్దంటూ కోర్టుకు వెళ్లారని, వారంతా పట్టణ అభివృద్ధి దృష్ట్యా కేసు వెనక్కు తీసుకోవాలని కోరారు. వారికి చట్ట పరిధిలో ఎంతవరకు సాయం అందించాలో అంత సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కదిరిగేట్‌ ఆర్వోబీ పనులు పూర్తవ్వగానే రేగాటిపల్లి రైల్వేగేట్‌ వద్ద ఆర్వోబీ నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ రెండ్‌ ఆర్వోబీలు పూర్తయితే ధర్మవరం పట్టణం ముఖ చిత్రం మారిపోతుందన్నారు. ఆర్వోబీ కింద ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల త్యాగాన్ని గుర్తించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వెళ్లి పూలమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. పరిహారం పెంచాలంటూ కొంతమంది నిర్వాసితులు ఎమ్మెల్యేకు చెప్పడంతో సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ యుగేశ్వరిదేవి, మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వేముల జయరామిరెడ్డి. పట్టణాధ్యక్షులు నీలూరి ప్రకాష్‌, కోటిరెడ్డి బాల్‌ రెడ్డి,కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్‌, శంకర తేజేశ్వర్‌, గోరకాటి పురుషోత్తం రెడ్డి,అత్తర్‌ జిలాన్‌ భాష,కేతా లోకేష్‌, జెసిబి రమణ, కడపరంగస్వామి,గజ్జల శివ,చింతఎల్లయ్య, మారుతి ప్రసాద్‌, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రం సీన, నాయకులు కాచర్లఅంజి,ఈశ్వర్‌ రెడ్డి, చాంద్‌బాషా, జమీర్‌ అహ్మద్‌, తోపుదుర్తి వెంకట రాముడు, కాలంగిశీన, అజంతాకృష్ణ, బైముతకరమణ, బాలం గోపాల్‌,చెలిమి పెద్దన్న, కత్తె పెద్దన్న, దాసు నాయక్‌, పరంధామ రెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, రవీంద్రారెడ్డి, ఆర్‌ అండ్‌ బి అధికారులు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు

➡️