రోడ్డు పనులను చూపుతున్న టిడిపి నాయకులు
హిందూపురం : పురపాలక సంఘంలోని 25వ వార్డులో రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర పలు మార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం లేక పోవడంతో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు సమస్యను వివరించారు. స్పందించిన బాలయ్య రోడ్డు నిర్మాణానికి అంచన వేయించి, రూ. 1.20 లక్షలతో రోడ్డు నిర్మాణం చేశారు. పూర్తి అయిన రోడ్డును వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర, టిడిపి పట్టణ అధ్యక్షులు రమేష్ కుమార్, టిడిపి నాయకులు శుక్రవారం పరిశీలించారు.