శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదు

Dec 1,2023 21:58
శ్రీవారి లడ్డు నాణ్యత లేదు'డయల్‌ యువర్‌ ఈఓ'లో భక్తుల ఫిర్యాదు

శ్రీవారి లడ్డు నాణ్యత లేదు’డయల్‌ యువర్‌ ఈఓ’లో భక్తుల ఫిర్యాదుప్రజాశక్తి- తిరుమలతిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవల ఆఫ్‌ లైన్‌ డిప్‌ లో ఎస్‌ఏంఎస్‌లు రావడం లేదని డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ద్వారా భక్తులు తెలిపినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆఫ్‌ లైన్‌ డిప్‌ ద్వారా సేవ టిక్కెట్లు పొందిన భక్తులకు ఈ అవకాశాన్ని పొందేలా వెబ్‌ సైట్లలో మార్పులు చేస్తామన్నారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించి 24 మంది భక్తుల సూచనలు సందేహాలను తెలుసుకున్నారు. స్వామివారి లడ్డుప్రసాదంలో నాణ్యత బాగాలేదని చక్కెర శాతం ఎక్కువగా వస్తుందని ఫిర్యాదు చేయగా లడ్డు విక్రయశాలలో లడ్డు ప్రసాదం తయారీలో చక్కెర శాతం తక్కువగా పోటు కార్మికులను ఆదేశించారు. పది రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే శ్రీవాణి ట్రస్టు,రూ 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా జారీ చేశామని, సర్వ దర్శన టోకెన్ల జారీపై సమగ్ర కార్యాచరణ చేస్తున్నామన్నారు. నవంబరు నెలలో 19.73 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం ద్వారా 108.46 కోట్లు లభించిందన్నారు. 97.47 లక్షల లడ్డు ప్రసాదం విక్రయాలు జరిగాయని తెలియజేశారు.డయల్‌ యువర్‌ ఈవోలో ఎవి ధర్మారెడ్డి

➡️