ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాను క్రీడల పండుగ పలకరించనుంది. కలెక్టర్ పర్యవేక్షణలో స్టెప్ అధికారులు, జిల్లా కేంద్రంలోని ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో ఆడుదాం ఆంధ్ర క్రీడల పండుగను పట్టాలకు ఎక్కిస్తున్నారు. జిల్లాలోని 565 సచివాలయాల పరిధిలోని క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఈ నెల ఐదవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల నమోదు కొనసాగనుంది. అనంతరం ఆయా సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల నమోదు కొనసాగించాలని భావిస్తోంది. వేలాది మంది క్రీడాకారులు సందడి చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.వేధిస్తున్న మైదానాల కొరతజిల్లాలోని 565 సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలోని హైస్కూళ్లలో సుమారు 250 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 265 సచివాలయాల పరిధిలోని మైదానాలకు వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. 371 సచివాలయాల పరిధిలో మైదానాలు లేనట్లు తెలుస్తోంది. స్టెప్ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. క్రీడల నిర్వహణలో ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండటానికి ఇతర సచివాలయాల పరిధిలోని మైదానాలను సరద్దుబాటు చేసు కోవాలని సూచనలు చేసిసింది.న్యాయనిర్ణేతలుగా వాలంటీర్లు జిల్లాలోని ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో వాలంటీర్లు కీలకంగా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా 250 మంది వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఏర్పడి నేపథ్యంలో ఎంపిక చేసిన వాలంటీర్లకు అధికార యంత్రాంగం క్రీడల్లో శిక్షణ ఇచ్చింది. వాలంటీర్ల సహకారంతో కొరత ఏర్పడిన ప్రాంతాల్లో వాలంటీర్ల సేవలను వినియోగించ నుంది. మైదానాలు కొరత కలిగిన సచివాలయ ప్రాంతాల్లోని ఐదు కిలోమీటర్ల లోపు సచివాయాల దగ్గర క్రీడలు నిర్వహించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ల ఊపు, మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆదుదాం ఆంధ్ర క్రీడల పోటీల నిర్వహణ జయప్రదంపై సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.జయప్రదంగా నిర్వహిస్తాం ఆడుదాం ఆంధ్ర పోటీలను జయప్రదం చేసి తీరుతాం. కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని ఇతర శాఖల సహకారం, సమష్టి సమన్వయాలతో విజయవంతంగా నిర్వహిస్తాం. మానవ వనరుల కొరతను సైతం దిగ్విజయంగా అధిగించి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చుతాం.- సాయిశ్రీ గ్రేస్, స్టెప్ జిల్లా అధికారి, కడప.