ప్రజాశక్తి – కడప అర్బన్ సమగ్ర శిక్షలో సుమారు 12 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యో గులను గుర్తించి వేతనాలు పెంపుదలకు కషి చేయాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డిని కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం విద్యాశాఖకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. సమగ్ర శిక్షలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల అంతటి ప్రాధాన్యత ఇచ్చి వారి బతుకు చక్రం సజావుగా సాగేందుకు కషి చేయాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి జీవన మనుగడకు మంచి సహాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయ కుమారి, రాజు, సిద్ధారెడ్డి, సిఆర్పిలుశంకర్, ఎం.వి. నాగమణికుమారి, హాజిరాబాను, జమీలునిసా, రామచంద్ర, మురళీకష్ణ, మెసెంజర్ చిన్నయ్య, పాల్గొన్నారు.