ప్రజాశక్తి – భీమవరం రూరల్
వెంప నుంచి వారతిప్ప ఆర్‌ఆర్‌అండ్‌బి రోడ్డు గోతులు పూడ్చి రోడ్డు వేయాలని సిపిఎం మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వెంప నుంచి వారతిప్ప ఆర్‌అండ్‌బి రోడ్డు గోతులు పూడ్చి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ వెంప నుంచి వారతిప్ప వెళ్లే ఆర్‌ఎంబి రోడ్డు గోతులు పడడం వల్ల నిత్యం వందలాది మంది రైతులు, విద్యార్థులు, ప్రజలు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంప నుంచి వారతిప్ప వెళ్లే ఆర్‌ఎంబి రోడ్డు గోతులు పూడ్చి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండుబోయిన సత్యనారాయణ, దొమ్మేటి నాగరాజు, చిలకపాటి సూర్యప్రకాష్, సానబోయిన సత్యనారాయణ, పట్టెం సారవయ్య పాల్గొన్నారు.