అమలాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-యంత్రాంగం
ఎయిడ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలుచోట్ల అవగాహనా ర్యాలీలు నిర్వహించారు.అమలాపురం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్క రించుకొని స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు హెచ్‌ఐవి, ఎయిడ్స్ బాధితులకు ఏర్పాటు చేసిన అల్పాహారం విందులో జిల్లా కలెక్టర్, ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు సాయి రాజ్ సాత్విక్ తో కలిసి పాల్గొని అల్పాహారాన్ని ఆరగించారు. హెచ్‌ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల ప్రతి ఒక్కరు సేవాతత్పరతతో ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడారు. బాధితులకు జల్లి సుజాత, ఒంటెద్దు వెంకన్న నాయు డు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ కూర్చిన 40 మంది బాధితులకు రూ.2 వేలు విలువచేసే డ్రై ఫ్రూట్స్ రెండు టవల్స్ ఒక దుప్పటి టూత్ బ్రష్, పేస్టు కందిపప్పు2 సబ్బులతో కూడిన పోషకాహార కిట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో . డి ఎం అండ్ హెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర ఆర్‌డిఒ జి.కేశవర్ధన్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిహెచ్‌వి భరతలక్ష్మి తదితరులు పాల్గొన్నా రు. మండపేట హెచ్‌ఐవి రోగులపట్ల వివక్షత చూపకుండా సేవలందించాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ వేగుళ్ళ నారాయణబాబు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పపత్రిలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఐసిటిసి కౌన్సిలర్ డి. నాగలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని ఆస్పత్రి వైద్యులు, అభివద్ధి కమిటీ మెంబర్ యరమాటి వెంకట్రాజుతో కలిసి ర్యాలీని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో వైద్యులు డాక్టర్ సతీష్, డాక్టర్ బావన, డాక్టర్ ప్రసన్నా, పిఎంపి అసోసియేషన్ నాయకులు ప్రిస్కిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అయినవిల్లి ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సమిష్టిగా సహకరించాలని అయినవిల్లి సిహెచ్‌సి వైద్యాధికారులు బి. మంగాదేవి, పి సంతోష్ కుమార్ అన్నారు. మండలంలోని ఆయా పీహెచ్‌సీల పరిధిలో వైద్యారోగ్య సిబ్బంది బారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. సిహెచ్‌ఒ జియన్‌ఎస్.రాంబాబు, సూపర్‌వైజర్లు పి.ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక కషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సమిష్టిగా సహకరించాలని ఆలమూరు సిహెచ్‌సి వైద్యాధికారి పి.గోపిరామ్, చొప్పెల్ల, పెదపళ్ల పిహెచ్‌సిల వైద్యాధికారులు పి.భవానీశంకర్, డి.సువర్చలాదేవి, ఆర్.మల్లిఖార్జున్, డి.సాయి కిషోర్ అన్నారు. ఆయా సిహెచ్‌సిీ, పిహెచ్‌సిల పరిధిలో వైద్యారోగ్య సిబ్బంది ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ప్రిన్సిపల్ ఎస్‌వి.ప్రసాదరెడ్డి, సిహెచ్‌ఒ పి.రాధాకష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ నివారణపై అవగాహన సదస్సు జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్లు ఎవివి.రాజా, బి.సూర్యనారాయణ, ఎంపిహెచ్‌ఇఒ కె.జ్యోతికుమార్, సూపర్‌వైజర్లు పి.శివప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, పి.ఉమ, ఆర్,బాలామణి పాల్గొన్నారు.