ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం యు టి ఎఫ్ రాజంపేట మండల శాఖ సర్వసభ్య సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులుగా జి.నాగేంద్ర, ప్రధాన కార్యదర్శిగా కె.శివయ్య, కోశాధికారి కె.రామచంద్ర, గౌరవాధ్యక్షులు కె.పాపయ్య, ఉపాధ్యక్షులు పి.రవి చంద్ర ప్రసాద్, మహిళా ఉపాధ్యక్షులుగా బి.సుమలత, సీపీఎస్ మండల కన్వీనర్ గా కె.శివ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు జిల్లా అధ్యక్షులు బి.హరిప్రసాద్ తెలియజేశారు. జిల్లా కౌన్సిలర్లుగా డి.చెంగల్ రాజు, ఎం.నాగేశ్వర్ గౌడ్, పి.వెంకట సుబ్బయ్య, పి ఎల్ ఎన్ వి ప్రసాద్, కె.వీరయ్య, ఆర్.సుబ్రమణ్యం, బి.హరినాధ్, పి.శివయ్య, కె.నరసయ్య, పి.మంజుల వాణి, పి.కవిత, ఆర్.రెడ్డెమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని హరిప్రసాద్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాజంపేట మండల యుటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.