ఓటుతోనే ప్రజాస్వామ్యం మనుగడ : ఆర్డిఓ

Dec 1,2023 12:40 #Kadapa
awareness on vote

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవడంతోనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుందని జమ్మలమడుగు ఆర్డిఓ జి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి పెద్ద పసుపుల మోటు వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఓటు ఆవశ్యకత పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వారు ఓటును వినియోగించుకోవాలన్నారు. చదువుకుంటున్న విద్యార్థులు తల్లిదండ్రులకు ఓటు విలువను తెలియజేయాలన్నారు. పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నప్పుడే ఏర్పడుతుందన్నారు. మార్చి, ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగవచ్చని ఎన్నికలలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచేలాగా కృషి చేయాలన్నారు. చదువుకున్న మేధావులు ఓటును వినియోగించుకోకపోవడం వలన సమర్థవంతమైన వ్యక్తులను ప్రతినిధులుగా ఎన్నుకోలేని స్థితిలోకి వెళ్తామన్నారు. తెలంగాణలో గడిచిన ఎలక్షన్ల కంటే నిన్న జరిగిన ఎలక్షన్లలో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. అందుకు కారణం ఓటింగ్ కు రాకపోవడమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ షఫీ, జమ్మలమడుగు తాసిల్దార్ గురప్ప, ఎన్నికల సీనియర్ అధికారులు మస్తాన్ వలి, వివేకానంద రెడ్డి, ఎస్పీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పాల నాగేశ్వర రెడ్డి, షిర్డీసాయి డిగ్రీ కళాశాల యాజమాన్యం సంజీవ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️