ప్రజాశక్తి – అమలాపురం : రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా సంచలనం సృష్టించిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమల కుమారి గురువారం తెలిపారు. విజయవాడలోని కెఎల్ యూనివర్సిటీ నందు జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నందు రాష్ట్రవ్యాప్తంగా 1084 ప్రాజెక్టులను ప్రదర్శించారని ఆమె తెలిపారు. వాటి నుంచి మొదటి 17 స్థానాలు గెలిచిన ప్రాజెక్టులు జాతీయస్థాయి సైన్స్ కాంగ్రెస్ కి ఎంపికయ్యాయని తెలిపారు. సమనస నందు గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి చైతన్య దీపిక, గైడ్ టీచర్ సుభాషిని ఆధ్వర్యంలో నిర్వహించిన మన కోనసీమ సంపద పులసను సంరక్షించు కుందాం అనే ప్రాజెక్టు జాతాయ స్థాయికి ఎంపికైందని ఆమె తెలిపారు.
చైతన్య దీపికకు ఎస్సిఇఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి, మెంబర్ సెక్రటరీ ఆఫ్ కాస్ట్ అపర్ణ, రాష్ట్ర సైన్స్ సిటీ కోఆర్డినేటర్ జయరాం రెడ్డి, కెఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు చేతుల మీదగా నగదు పురస్కారం ట్రోఫీ అంద జేశారన్నారు. ఈ విద్యార్థిని త్వరలో జరగబోయే జాతీయస్థాయి సైన్స్ కాంగ్రెస్ దినోత్సవం లో పాల్గనవలసి ఉంటుందని వాటికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని జిల్లా సైన్స్ అధికారి జివిఎస్.సుబ్రహ్మణ్యం తెలియజేశారు. జాతీయస్థాయి ఎంపికైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ బందాన్ని మరియు విద్యార్థిన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమల కుమారి, జిల్లా సైన్స్ అధికారి జివిఎస్.సుబ్రహ్మణ్యం, జిల్లా ఎకాడమిక్ కోఆర్డినేటర్ బ్రహ్మానందం, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఫణిబాల లక్ష్మీనరసింహ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సురేష్, బి.రమణశ్రీ అభినందించారు.