ప్రజాశక్తి-రంపచోడవరం
మండలంలోని బందమామిడి నుండి రంపచోడవరం వెళ్లే రహదారి మధ్యలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువపై రోప్ వే బ్రిడ్జి నాలుగు నెలల్లో నిర్మాణం చేస్తామని రంపచోడవరం ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే తెలిపారు. ఈ కాలువ దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గురువారం గ్రామస్తులు ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే వారు స్పందించి రంపచోడవరం ఐటీడీఏ పీవో ఛాంబర్‌కు గ్ర్రామస్తులతో కలిసి వెళ్లి పిఓ సూరజ్ గనోరేకు సమస్యను తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన పిఓ నాలుగు నెలల సమయంలో రోప్ వే బ్రిడ్జిని అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు.