ప్రజాశక్తి-వెలిగండ్లఉమ్మడి ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఏంఏ షరీఫ్ హాజరయ్యారు. వెలిగండ్ల, కనిగిరి ముస్లిం మైనార్టీ నాయకులు సమావేశమై మైనార్టీల సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీల టిడిపి అధికార ప్రతినిధి షేక్ రోషన్ సంధాని, తెలుగుదేశం రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షుడు షేక్ జంషీర్ అహమ్మద్, జిల్లా మాజీ కో ఆప్షన్స్ సభ్యులు షేక్ షరీఫ్, ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ కార్యనిర్వహక కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, వెలిగండ్ల మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ మజహార్, షేక్ మౌలానా ఆజాద్, కారుమంచి బాలనాసర్, బీసీ నాయకులు శోభిరాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.