గురజాడ స్ఫూర్తితో సమస్యలపై సమరం సాగించాలి

ప్రజాశక్తి-కనిగిరి:  సమాజంలో మహిళల ఉన్నతికై మహాకవి గురజాడ తన సాహిత్యం ద్వారా చైతన్య జ్వాలలు రగిలించారని ఐద్వా నాయకురాల్లు ఎస్‌కె బషీరా, కె లక్ష్మీప్రసన్న అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం గురజాడ వర్థంతి కార్యక్రమాన్ని ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ స్ఫూర్తితో సామాజిక సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని సనాతన సాంప్రదాయాలను మట్టుబెట్టాలని, తన రచనల ద్వారా ఆధునిక భావాలతో సమాజాన్ని ముందడుగు వేయించిన గురజాడ మహాత్ముడని అన్నారు. బాల్యవివాహాలు, వరకట్న దురాచారం లాంటి సామాజిక సమస్యలు సమాజ మనుగడను, మహిళలను అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లాంటి నవలలతో సామాజిక స్పృహ కలిగించాలని అన్నారు. ఆ మహాత్ముడు స్ఫూర్తితో నేటి ఆధునిక మహిళలు సమానత్వ సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సిహెచ్‌ శాంతకుమారి, జి ఆదిలక్ష్మి, షఫీలా, ఎస్కే ముంతాజ్‌, కే రత్తమ్మ, బీ వరలక్ష్మి, ఎస్కే లాల్‌ బి, ఎస్‌ రమ, ఎం ఎలీశమ్మ, ఎం వెంకటమ్మ, వై ఎలీశమ్మ, ఎస్‌ రమణమ్మ పాల్గొన్నారు.

➡️