ప్రాక్టికల్‌ మార్కుల్లో వివక్ష ఫిర్యాదుపై విచారణ

ప్రజాశక్తి – మాచర్ల : స్థానిక ఎస్‌కెబిఆర్‌ డిగ్రీ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ మార్కులలో వివక్షత చూపారంటూ కంప్యూటర్‌ సైన్స్‌ గెస్ట్‌ లెక్చరర్‌ విజరు కుమార్‌పై విద్యార్థులు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిమిత్తం ఉన్నతాధికారులు కాలేజీలో గురువారం విచారణ చేపట్టారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ బీకాం కంప్యూటర్‌ సైన్స్‌ తృతీయ సంవత్సర విద్యార్థులు సుమారు 20 మంది ఉన్నారని, వారిలో ఎక్కువమంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులకు పైగా సాధించారని చెప్పారు. కానీ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రాక్టికల్స్‌లో లెక్చరర్‌ విజయభాస్కర్‌ కావాలని తమపై వివక్షతో చూపుతూ అందరికీ తక్కువ మార్కులను వేశారని, దీనిపై ప్రిన్సిపాల్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందిచలదేన్నారు. ప్రాక్టికల్స్‌ మార్కులు తక్కువగా రావడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలకు నష్టం జరుతుదుందని, తమకు న్యాయం చేయాలని కోరారు. విచారణలో ఆర్‌జెడి విఆర్‌ జ్యోష్ణకుమారి, కె.శ్రీనివాసరావు, డి.కళ్యాణి హాజరయ్యారు.

➡️