9న జాతీయ లోక్‌ అదాలత్‌

Nov 30,2023 22:40
9న జాతీయ లోక్‌ అదాలత్‌

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్‌ కరుణకుమార్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సుప్రీం కోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనలు మేరకు ఈనెల 9వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవ సధన్‌ భవనంలో డిసెంబర్‌ 9న జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో అనేకమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టులో వేయని వివాదా కేసులు ఉంటే అవి కూడా ముందస్తు పిటిషన్స్‌ ఫిర్యాదుగా స్వీకరించి సమన్యాయం అందించుటకు ఈ లోక్‌ అదాలత్‌ మంచి పాత్రను పోషిస్తుందన్నారు. కోర్టులలో తీర్పు చెప్పినప్పుడు ఒకరు విజయం సాధిస్తే మరొక్కరు అపజయ అవుతారని, దీనికి విభిన్నమైన రీతిలో లోక్‌ అదాలత్‌లో కక్షదారులు మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకోవడంతో వివాదాన్ని సున్నితంగా పరిష్కారం చేసుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న సమన్యాయం, సామాజిక న్యాయం, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాలలో కక్షదారులకు సత్వర న్యాయం అందించుటకు లోక్‌ అదాలత్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. గత సెప్టెంబర్‌ మాసంలో జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సుమారు 18 వేలపై చిలుకు వివిధరకాల కేసులను పరిష్కారం ద్వారా రూ.34 కోట్లు రికవరీ చేసి రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా మూడవ స్థానంలో ఉందన్నారు. 9న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్‌ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షదారులు పాల్గొని జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలని తెలిపారు.

➡️