రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు కాకర్ల కౌశిక్‌

ప్రజాశక్తి-కలసపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కాకర్ల కౌశిక్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెసుకు ఎంపికైనట్లు జిల్లా వికలాంగుల సేవా సమితి నాయకుడు వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మండలంలో విలేకరుల ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణపల్లికి చెందిన కమిషనర్‌ కాకర్ల చెన్నారెడ్డి నిర్మలాదేవి కుమారుడు, కాకర్ల కౌశిక్‌ ఎంపిక కావడం పట్ల వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సతీమణి భారతి అభినందించారు.

➡️