డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రోత్సహించాలి

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

స్థానిక మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కోనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన సుమారు 35 రకాల ఉత్పత్తులతో అర్బన్‌ మార్కెట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్‌ పి.భవానీప్రసాద్‌, చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి, వైస్‌ఛైర్మన్‌ ముప్పిడి అంజి, కంచర్ల వాసవీరత్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సిహెచ్‌.అచుత్యరామయ్య, కౌన్సిలర్లు, మెప్మా టిఎంసి నాగమణి, టిఎల్‌ఎఫ్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️