ప్రజాశక్తి – కాళ్ల
కోపల్లె సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్, వైసిపి పెదఅమిరం గ్రామ అధ్యక్షులు వేగేశ్న జయరామకృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు ఏలూరుపాడులో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఏలూరుపాడులో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి భూపతిరాజు జగ్గరాజు ఆధ్వర్యంలో వేగేశ్న జయరామ కష్ణంరాజుతో కేక్‌కట్ చేయించారు. డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు, ఎంపిపి శిరీష విశ్వనాధరాజు, ఎంపిటిసి చిన్నాపరపు రాంబాబు, వైసిపి మండల కన్వీనర్ గణేశ్న రాంబాబు, ఆకివీడు ఎఎంసి డైరెక్టర్ పడమట సుబ్బయ్య, మంతెన రామకృష్ణంరాజు, ఆదియ్య, కొనా రంజిత్, వైసిపి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.