ప్రజాశక్తి కాకినాడ : డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.వి.అర్ ప్రసాద్ రాజు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు లు గురువారం కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కాకినాడలో జరిగే ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చెయ్యాలన్నారు. శాసనమండలి సభ్యులు ఇళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. డిసెంబరు 27, 28, 29 తేదీలలో జరిగే ఎస్ఎఫ్ఐ 24 వ రాష్ట్ర మహాసభలను విద్యాభిమానులు, విద్యావేత్తలు, మేధావులు అందరూ సహకరించి జయప్రదం చెయ్యాలని అన్నారు. దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ 53 ఏళ్ల చరిత్రలో కాకినాడ నగరంలో మొదటిసారి మహాసభలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల ఉద్యమాల ముద్దు బిడ్డ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులకు కాకినాడ జిల్లాలో ఉన్న విద్యార్థులు అందరూ ఘన స్వాగతం తెలపాలని ఈ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు పి. వరహాలు, ఎమ్. గంగా సూరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. రాజా నాయకులు వై.భాస్కర్ పాల్గొన్నారు.