ప్రజాశక్తి – గోనెగండ్ల(కర్నూలు) : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకొనేందుకు యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బి.నవీన్ పాటి, ఎస్ నరసింహులు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమయిన గోనెగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మండల అధ్యక్షులు రామన్ ఆధ్వర్యంలో మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజం రెండు ప్రగతిశీలంగా అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ కీలకమైనది కనుక ఆ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించి సామాజిక స్పృహతో పనిచేసి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకు,విద్యార్థుల సర్వతోముఖాభివద్ధికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరణ చేసి పదవీ విరమణ అనంతరం ఉద్యోగ,ఉపాధ్యాయులకు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు.
నూతన మండల కమిటీ ఎన్నిక
గౌరవ అధ్యక్షులుగా విజయ్ కుమార్, అధ్యక్షులుగా పి.మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా యు.చంద్రపాల్, సహా అధ్యక్షులుగా ఉమ, అక్బర్ బాష, ఆర్థిక కార్యదర్శిగా నాగేశ్వరావు, జిల్లా కౌన్సిలర్లుగానీలకంఠ, లింగన్న, కేశవులు, గుమ్మల బాబు, నాగలక్ష్మి, వేణుగోపాల్, ఆడిటర్‌గా పెద్ద ఖాజాన్న, తొమ్మిది మందిని మండలం కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాముడు, స్వర్ణమంజుల, వెంకటరమణ, లలిత, తాజుద్దీన్, మద్దిలేటి, సోమనాథ గౌడ్, చౌడయ్య, సుంకన్న, ఉదరు భాస్కర్, అబ్దుల్ సలీమ్ పాల్గొన్నారు.