అర్హులంతా ఓటు నమోదుచేసుకోవాలి

విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్‌ వెంకటేశ్వరి

ప్రజాశక్తి-ఉప్పలగుప్తం

18 ఏళ్లు దాటిన విద్యార్థులంతా చైతన్యంగా ఓటు నమోదుకు ముందుకు రావాలని తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి సూచించారు.గొల్లవిల్లి ఎంఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం సిస్టమేటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోల్‌ పార్టిసిపేషన్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులంతా 18 ఏళ్లు నిండగానే ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని అవగాహన కల్పించారు. విద్యార్థులు ఓటు అర్హత సాధించి ఆ హక్కును ఓ ఆయుధంలా ఉపయోగించుకోవాలని సూచించారు. ఓటు ఎలా నమోదు చేసుకోవాలి ఏ ఫారం పూర్తి చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

 

➡️