ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడికాలువకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి విషయంలో ఏపీ, తెలంగాణ పోలీసుల్ని భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. ఈ క్రమంలో నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదలయ్యాయి. సాగర్ ప్రాజెక్ట కుడి కాలువకు నీటిని ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 2వేల క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు.