ప్రజాశక్తి-చోడవరం : చోడవరం పంచాయతీలో అంకుపాలెం దారిలో స్మశాన వాటిక చాలా కాలం పెట్టి ఆక్రమణ గురైందని, స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఎన్నో సందర్భాల్లో పంచాయతీ కార్యాలయం వద్ద మరియు స్మశాన వాటిక వద్ద నిరసనలు ధర్నాలు నిర్వహించారని తెలిపారు. అధికారుల్లో ఎటువంటి చలనం లేకుండా ఉండడంతో చోడవరంలో వస్త్రవ్యాపారైన పసుమర్తి అశోక్ మరియు వాళ్ళ అన్నదమ్ములు ముందుకు వచ్చి సుమారుగా స్మశాన వాటిక పదకొండు లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతా ఉంటే బాలు ఇప్పటికే సగం పని పూర్తి చేసి ఉన్నారు. అదే సందర్భంలో స్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన పసుముక్త అశోక్ బ్రదర్స్‌కు కమ్యూనిస్టు పార్టీ తరఫునుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా మన గ్రామం మన అభివృద్ధిని మనమే చేసుకోవాలని బూర్జువా పార్టీ రాజకీయ నాయకులు స్మశానాలు కూడా ఆక్రమించే పరిస్థితిలో ఉన్నారని కావున మన ఊరిని మన అభివృద్ధి చేసుకునే పద్ధతిలో అందరూ సహకరించాలని పసుమర్తి బ్రదర్స్ వారి యొక్క ఆలోచనలను గ్రామాల్లో ఉన్న అందరూ పంచుకుంటే ఉంటూ ఆ గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మరియు అక్కడున్న ప్రజలు స్మశాన వాటిని సందర్శించి అశోక్ బ్రదర్స్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేమల నరసింగరావు, ద్వారపూడి నాగేశ్వరరావు, గణేష్ మరియు అక్కడున్న ప్రజలు పాల్గొన్నారు.