అగ్నికి ఆహుతి అయిన కోళ్ల ఫారం

poultry farm

20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం

ప్రజాశక్తి-వి.కోట : చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన వి కోటలో సోఫాలు తయారు చేసే కోళ్ల ఫారం షెడ్డులో మంటలు చెలరేగి కోళ్ల ఫారం పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు వివరాలు. కే కొత్తూరుకు చెందిన సయ్యద్ పట్రపల్లి సమీపంలో కే జి ఎఫ్ రోడ్డులో గల కోళ్లపారంలో సోఫాల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో షెడ్డులో ఓవైపు ఆకస్మికంగా చెలరేగిన మంటలు క్రమేపి గాలికి పూర్తిగా షెడ్డు మొత్తం అలముకున్నాయి.క్షణాల వ్యవధిలో కోళ్ల ఫారంలోని మొత్తం తయారీ సామగ్గిరికి మంటలు వ్యాపించడంతో సుమారు నూరు అడుగుల దూరం రోడ్డు దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన పరిసరాల వారు షేడ్ యజమానికి తెలిపి అప్రమత్తమయ్యేసరికి మంటలు ఆకాశానికి ఉవ్వెత్తనగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఆటవి, విద్యుత్ శాఖ, పోలీస్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఫైర్ స్టేషన్ అందుబాటులో లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది కోసం కుప్పంకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకునే లోపు స్థానికులు మంటలు వెనుక వైపు వ్యాపించకుండా జెసిబి సాయంతో షెడ్డును తొలగించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల మేరకు ఆస్తి నష్టం సంబంధించినట్లు బాధితులు తెలిపారు.

➡️