ప్రజాశక్తి-శింగరాయకొండ : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఆధ్వర్యంలో వచ్చేనెల 2న ప్రకాశం క్రికెట్ లీగ్బై మాగుంట టీ -10 క్రికెట్ టోర్నమెంట్ కొండపి నియోజక వర్గ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మారెడ్డి వెంకట్రాదిరెడ్డి తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్రాదిరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాల స్థాయిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు టీషర్టులు, బ్యాట్, బాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, బెస్ట్ బ్యాట్స్‌మాన్‌కు రూ.5వేలు, బెస్ట్ బౌలర్‌కు రూ.5వేలు, బెస్ట్ ఫీల్డర్‌కు రూ.5వేలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు రూ.5వేలు అందజేయనున్నట్లు తెలిపారు. మాగుంట రాఘవరెడ్డి సహకారంతో ఎలాంటి ఏంట్రా ఫీజు లేకుండా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జూనియర్ కళాశాలలోని క్రీడా మైదాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసిపి వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, బెల్లం సత్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి, నాయకులు పి.సాగర్‌రెడ్డి, ఎస్కె.సలీం బాషా, పామర్తి మాధవరావు, ముల్లపూడి సత్యనారాయణ, శీలం రాము, షేక్ మున్నా, మోటుపల్లి కిషోర్, ఎంపిటిసి అంబటి ప్రసాద్, పాశం శ్రీనివాసరావు పాల్గొన్నారు.