స్కూల్‌ కాంప్లెక్స్‌ను వినియోగిచుకోవాలి

స్కూల్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఉపాధ్యాయులకు స్కూల్‌ కాంప్లెక్స్‌లు శిక్షణా కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని అర్బన్‌ రేంజ్‌ డిఐ బి.దిలీప్‌కుమార్‌ అన్నారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్‌ హైస్కూల్‌ కాంప్లెక్స్‌లో ప్రాథమిక పాఠశాలల స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను బుధవారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో ఎప్పటికప్పుడు తీసుకొస్తున్న మార్పులను కాంప్లెక్స్‌ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ఆ అంశాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని పాఠశాల స్థాయిలో వినియోగించాలని కోరారు. షెడ్యూల్‌ ప్రకారం కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. హెచ్‌ఎంలు పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను షెడ్యూల్‌ ప్రకారం ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆదేశించారు. కార్యాలయానికి అందజేయవలసిన వివరాలను సమయానికి అందజేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాలకు అందజేసిన గుడ్లు, చిక్కీల వివరాలను ఐఎంఎంఎస్‌ యాప్‌లో విధిగా నమోదు చేయాలన్నారు. కాంప్లెక్స్‌ సమావేశాలకు హాజరైన ఉపాధ్యాయుల వివరాలు ఇచ్చిన గూగుల్‌ ఫామ్‌లో కార్యాలయానికి సబ్‌మిట్‌ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్పర్సన్‌ ఎన్‌.రాజా ప్రశాంత్‌, కార్యదర్శి పరస జగన్నాథ రావు, సిఆర్‌పి జయంతి శాస్త్రి, కోటేశ్వరి, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు 33 మంది హాజరయ్యారు.

➡️