తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించాలి : కలెక్టర్‌

Nov 29,2023 20:51

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో వంద శాతం తప్పులులేని ఓటర్ల జాబితా రూపొం దించడమే లక్ష్యం కావాలని కలెక్టర్‌ గిరీష ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలకు చూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హల్‌లో ఓటర్‌ జాబితా సవరణపై ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫామ్స్‌ పెండింగ్‌ అనుకున్నంత స్పీడ్‌గా జరగలేదన్నారు. 7 డేస్‌ పెండెన్సీ ఫామ్స్‌ 8వ రోజుకు పోకుండా క్లియర్‌ చేయాలని పేర్కొన్నారు. 7 డేస్‌కి సంబంధించి జిల్లాలో 3092 ఫామ్స్‌ పెండింగ్లో ఉన్నాయని వీటన్నింటినీ వెంటనే క్లియర్‌ చేయాలన్నారు. 30, 45 రోజులకు పైగా ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చివాటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తు జాగ్రత్తగా పరిష్కరించాలని, ఫామ్స్‌ తో పాటు విచారణ నివేదిక, నిర్ణయానికి సంబంధించిన డాక్యుమెంట్‌ ప్రూఫ్‌ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అతి ముఖ్యమైనదని18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌తో సమావేశం నిర్వహించి 18 సంవత్సరాలు నిండి వారు ఇంకా ఓటర్‌ గా నమోదు కాకపోతే అలాంటి వారికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఓటర్‌గా ఎన్రోల్‌ చేయించాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా అర్హులైన ఓటర్లు వందశాతం నమోదు కావాలని ఇందుకు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఎక్కడైనా ఓకే డోర్‌ నెంబర్లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వాటిని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసి జంక్‌ ఓటర్లను పక్కగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వర్తిస్తే రాబోవు ఎన్నికలను సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చునని అధికా రులందరూ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, కెఆర్‌ఆర్‌సి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీలేఖ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్‌ పాల్గొన్నారు.

➡️