ప్రజాశక్తి-పెనగలూరు భూమి లేని నిరుపేదలకు భూహక్కు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభు త్వం భూపట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీని వాసులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామంలో 74 మంది లబ్ధిదారులకు 112 ఎకరాల భూ పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ఉన్నత చదువుల కోసం ఫీజు రీయంబర్స్ మెంట్, ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచారని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన తనయుడు సీఎం జగన్ ప్రజల చెంతకే పాలనను అందించేందుకు సచివాలయ, వాలంటరీ వ్యవస్థలు తీసుకవచ్చి సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. చరిత్రలో 30 లక్షల ఎకరాలకు పేదలకు భూములకు హక్కులను కల్పించిన ఘనత సిఎంకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చక్రపాణి, జడ్‌పిటిసి సుబ్బరాయుడు, మండల వ్యవసాయ సలహామండలి చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, వీరనారాయణరెడ్డి, మండల జెఎస్‌ఎస్ కన్వీనర్ వెంకటరెడ్డి, తహశీల్దార్ శ్రీధర్‌రావు, ఎంపిడిఒ వరప్రసాద్, స్థానిక నాయకులు సానారెడ్డి, నరసింహారెడ్డి, ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.మహిళకు భూపట్టాను అందిస్తున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు