ప్రజాశక్తి-ములకలచెరువు గ్రామాల్లో నిర్వహించే భూసర్వే వివరాలు ప్రతి రైతులకు తెలపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్ తెలిపారు.బుధవారం మండలంలోని కాట్నగల్లు పంచాయతీ బూచిపల్లె వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. రైతులకు నోటీసులు అందజేశారా , గ్రామ సభనిర్వహించారా అంటూ రైతుల వద్ద ఆరాతీశారు. అనుభవపత్రాలు ఆంద జేసి సర్వే అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. అనంతరం పులికల్లు పంచాయతీ జగడంవారిపల్లెలో ఉన్న గయ్యాళుభూమిని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విద్యాసాగర్, డిప్యూటి తహశీల్దార్ ధనుంజేయులు, సర్వేయర్‌ను, రఫీక్ , ఆర్ఐ అనిషా, విఆర్‌ఒలు షంషాద్,సుస్మితలు పాల్గొన్నారు.