ప్రజాశక్తి-కడప అర్బన్ ముస్లిం, మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీ అధికారంలోనే సాధ్యపడుతుందని మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో టిడిపి మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా ముస్లిం నాయకుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల ఓటుతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు ఏమి చేసిందని సూటిగా ప్రశ్నించారు. ఇంజినీరింగ్ కాలేజీలు, హజ్ హౌస్, షాది ఖా నాలు నిర్మించిన ఘనత టిడిపిదేనని గుర్తు చేశారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం ల విడిది కోసం చంద్రబాబు కోట్లు వెచ్చించి హజ్‌హౌస్‌ను నిర్మిస్తే, మనుగడ లేకపోవడం ఎవరి బాధ్యత అని ప్రశ్నిస్తూ, ఆ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదేనని నిలదీశారు. కేవలం ఈ ప్రభుత్వం ఆర్భాటాల ప్రభుత్వమని, రాష్ట్రానికి, ముస్లిం, మైనార్టీలకు ఊరగబెట్టింది ఏమీ లేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ముస్లింలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం దుల్హన్ పథకం ద్వారా ముస్లిం యువత పెళ్లిళ్లకు రూ.50 వేలు అందిస్తే, జగన్ తాను అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తానని ఆ పథకానికి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబం ధనలు పెట్టి నీరుగాడ్చారని విమర్శించారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తానని చెప్పి, మైనార్టీలను మోసం చేశార న్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే, రోడ్లపై నిరసనలు చేశారని, జగన్ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ప్రభుత్వం ముస్లింల ద్రోహి అని అభివర్ణించారు. రాబోవు ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ముస్లింలు గద్దె దింపి తీరాలన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ టిడిపి హ యాంలో ప్రవేశపెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిం దని మండిపడ్డారు. రూ.కోట్ల ముస్లిం సంక్షేమ నిధులు జగన్ సొంత కార్యక్ర మాలకు వాడుకున్నారని ఆరోపించారు వైసిపి పాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, తిరిగి టిడిపి అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగు తుందని చెప్పారు. జనసేన జిల్లా ఇన్‌ఛార్జి సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపి, జనసేన కలిశాయన్నారు. ముస్లిం, మైనార్టీల ఓట్లను గంప గుత్తగా ప్రభుత్వం వాడుకొని, మోసం చేసిందన్నారు. జగన్ గద్దె దింపితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.