శిశుగృహలో కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు

Nov 29,2023 16:00 #Krishna district
child housing posts

శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కృష్ణాజిల్లా లోని డి.సి.పి.యు. యూనిట్, శిశు గృహ నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు గాను ఈ క్రింది పోస్టులకు అర్హులు అయిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఎస్.సువర్ణ తెలిపారు. డి.సి.పి.యు. యూనిట్ నందు డి.సి.పి.ఓ. (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) – 1,
ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూష్ణల్ కేర్) – 1,
ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాస్ ఇన్స్టిట్యూష్ణల్ కేర్) – 1,
లీగల్ కం ప్రోభిషన్ ఆఫీసర్ – 1,కౌన్సిలర్ 1,
అకౌంటెంట్ – 1,సోషల్ వర్కరు-2 (ఓ.సి.-1, ఎస్.సి-1)
అవుట్ రిచ్ వర్కర్-1 (ఓ.సి.)అలాగే
శిశు గృహ మచిలిపట్నం నందు సోషల్ వర్కర్ – 1
డాక్టర్ పార్ట్ 1,ఆయలు ఇద్దరు ( ఓ సి,1ఎస్ సి,1)
చౌకి దార్ 1,పై పోస్టులకు అర్హత కలిగిన వారు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము లో మిషీన్ వాత్సల్య స్కీం లోని పోస్టులకు కాంట్రాక్టు పద్ధతి పై పనిచేసేందుకు అర్హులు అయిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. సెలక్షన్ కమిటి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు http//krishna.ap.gov.in వెబ్ సైట్ నందు ఖాళీపోస్టుల వివరాలు పొందుపరచటం జరిగిందన్నారు. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్ధులు పోస్ట్ యొక్క పూర్తి వివరముల కొరకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డోర్. నెం. 6-93 SSR అకాడమి రోడ్, ఉమాశంకర్ నగర్ 1వ లైన్, కానూరు వారిని సంప్రదించి వారి దరఖాస్తులను డిసెంబర్. 07 సాయత్రం 5.00 లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క పూర్తి వివరములుతో దరఖాస్తులు పంపాలన్నారు.

➡️