రైతులను ప్రశంసించిన బృంద సభ్యులు ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులపై అంతర్జాతీయ బృందం పర్యటన పూర్తి ప్రజాశక్తి- చిత్తూరు, రామకుప్పం:నేల తల్లిని కాపాడుకొంటూ మన వారసులకు సారవంతమైన భూమిని అందిద్దామని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సిఈఓ రామారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పరిశీలించడానికి చిత్తూరు జిల్లాలో ఈ నెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటించేందుకు జిల్లా వచ్చిన అంతర్జాతీయ బందం పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం పెనుమూరు మండలం చార్వగానిపల్లి, రామకుప్పం మండలం అంకిరెడ్డిపల్లిలో వ్యవసాయ క్షేత్రాల సందర్శించింది. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సిఈఓ మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయం అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తున్నదని, మన రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది రైతులు ప్రకతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారన్నారు. మన నేలతల్లిని కాపాడుకోవడానికి, భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ప్రకతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారాన్ని తీసుకోవడం వలన పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండగలమన్నారు. ప్రతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, టిటిడి, ఫలదా, అమూల్ సంస్థలు ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి ముందుకొస్తున్నాయని అన్నారు, రైతులు ఆర్థికంగా అభివద్ధి చెందవచ్చునన్నారు. ఈపర్యటనలో భాగంగా అంతర్జాతీయ బందం చార్వగానిపల్లిలో మునెమ్మ, అంకిరెడ్డిపల్లిలో వెంకట రమణల ప్రకతి వ్యవసాయ పంటలను పరిశీలించిందని, రైతు పండిస్తున్న వైవిద్యాభరితమైన పంట విధానాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారని, ఏటిఎం పద్ధతిలో (ఎని టైమ్మనీ) తాత్కాలిక ధన అనవసరాల కోసం ఏ రోజుకారోజు దుంపలు, ఆకుకూరలు, కాయగూరలు తీసుకెళ్ళి అమ్మిసొమ్ము చేసుకునే పరిస్థితి ఉన్నదని, ప్రధాన పంటలు మామిడి వంటి పంటలో దాదాపు అంతర పంటగా 29 రకాల కూరగాయలు, ఆకు కూరలు పండించడం ద్వారా ఒక ఎకరాకు రెండు నుండి మూడు లక్షలు, ఫిష్ పాండ్ ద్వారా దాదాపు 4 లక్షల వరకు ఆదాయం పొందే విధానంను మెండైన ఆర్థిక సముపార్జన విధానాలను బంద సభ్యులు గమనించి, ఈ విధానాలను, జ్ఞాపకాలను తమ దేశాలకు తీసుకువెళతామని బందసభ్యులు తెలిపారన్నారు. ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలిచిన ఆర్ఓఎస్ఎస్ సంస్థ ద్వారా మన రాష్ట్రంలో అవలంభిస్తున్న ప్రకతి వ్యవసాయ పద్ధతులను సిఆర్పిలు, సిబ్బంది మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నేర్పడం జరుగుతున్నదని, దీనితో పాటు శ్రీలంక, ఇండోనేషియా, రుఆండా, కెన్యా దేశాలకు కూడా వెళ్ళి నేర్పడం జరుగుతుందని తెలిపారు. ప్రకతి వ్యవసాయం రైతుకు లాభసాటిగా, సమాజానికి మేలు కలిగించేదిగా ఉందని తెలిపారు. జిల్లాలో పర్యటించిన బందంలో విందారు దిమోనియో, మారియా క్లాడియా క్రిప్టాన్, షాలిని రామిరెజ్, మాన్యువల్ నర్జస్, మారియా కరోలినా, వాటిజ్ రోజాస్, అలెజాండ్రా, అలెజాండ్రా వరగాస్ మాడ్రిడ్, కెవిన్ ఒన్యాంగో, సుదర్శన్ మలైయప్పన్, గోపాల్ కుమార్, సిల్వియా వ్యానిరా, తొరై జిగ్వేనా, మార్సెలాబెల్ట్రాన్, సిమోన్ సైగర్ రివాస్, అర్వెన్సెలీ, రాక్సా సోక్, అరిలియా మాంజెల్లా ఎన్జీవా, ఆరిలియా మాంజిల్లా ఎన్జీ వానదియా బెర్గామిని గుల్షన్ బోరాలు ఉంటారు. ఈ పర్యటనలో మోడల్ మండల్ తిమాటిక్ లీడ్ రాము, డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం జి.వాసు, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.