పిచికారి చేస్తున్న దృశ్యం
ఎరువులు సమతుల్యంగా వాడాలి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:
వరిలో రసాయన ఎరువుల నత్రజని, భాస్పరం, పొటాషియం)ను సమతుల్యంగా వాడాలని ఆత్మ డిడిఎ. శివన్నారాయణ సూచించారు. మంగళవారం మండలంలోని చిన్నచెరుకూరు రైతు భరోసా కేంద్ర పరిధిలో వరి పైర్లను డిడిఎ శివ నారాయణ, ఏడిఏ రాజకుమార్, ఇ ఫ్కో కంపెనీ జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణలు పరిశీలించారు. శివ నారాయణ మాట్లాడుతూ రైతులు వరికి రసాయన ఎరువులను సమతు ల్యంగా వాడాలని తెలిపారు. నత్రజని ఎరువులను మూడు దఫాలుగా వేయాలని సూచించారు. నత్రజనిని నాటే ముందు దమ్ము లోను, నాటిన తర్వాత దుబ్బు చేసే దశలోనూ, అంకురం ఏర్పడే దశలోనూ వేసుకోవాలని శివన్నారాయణ తెలిపారు. బాస్పరం ఎరువులు దమ్ములో మాత్రమే వేయాలని, పొటాష్ ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలని చెప్పారు. అధిక శాతం రైతులు పొటాషియం ఎరువును వాడటం లేదని, ఈ నేపథ్యంలో తప్పనిసరిగా పొటాషియం 30 కిలోలు ఎకరాకు వేసుకోవాలని సూచించారు. దీనిని రెండు దఫాలుగా వేసుకో వాలని వివరించారు. మొదటగా దమ్ములో సగ భాగం, మిగతా సగభాగం అంకురం ఏర్పడే దశలో అనగా మూడవ దశలో నత్రజని వేసేటప్పుడు వేసుకోవాలని తెలియజేశారు. పోటాష్ ఎరువు వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా పైరు బెట్ట నుంచి, అలాగే పురుగులు, తెగుళ్ల నుంచి పైరు తట్టుకుంటుంద పేర్కొన్నారు. గింజ నాణ్యత, దిగుబడి పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ధాన్యం బరువు పెరుగుతుందన్నారు. అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా పొటాషియం వాడాలని సూచించారు. ఏడిఎ రాజ్ కుమార్ మాట్లాడుతూ రైతులు సాగు చేసే వరి పొలాల్లో భాస్వరం ఎరువులు భూమిలో ఎక్కువగా ఉన్నాయని, దాంతో తక్కువ మోతా దులో వేసుకోవాలని చెప్పారు. భాస్వరం ఎరు వులు ఎక్కువగా వేసుకుంటే జింకు లోపం వ స్తుందని దాంతో జింక్ సల్ఫేట్ కూడా ఎకరాకు 20 కిలోలు దమ్ములో వేసుకోవాలని సూచించా రు. ఈ సందర్బంగా అధికారులు అన్నం సురేంద్ర గౌడ్ వరి పొలంలో నానో డిఎపి ఏ విధముగా వాడాలో రైతులకు తెలియజేశారు. కార్యక్రమం లో గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.