ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం

శంకుస్థాపన కార్యక్రమంలో ఎంఎల్‌సి తోట తదితరులు

ప్రజాశక్తి-మండపేట

ప్రతి ఇంటికీి తాగునీరు అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. ఏడిద గ్రామంలో గ్రామ సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వైసిపి రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, ఎంపిపి ఉండమట్ల వాసుతో కలిసి మంగళవారం స్థానిక సావరం రోడ్డులోని తోట త్రిమూర్తులు కాలనీలో 15 ఆర్థిక సంఘం నిధులు రూ.6 లక్షలతో రోడ్డు, డ్రైన్ల నిర్మాణంతో పాటు దేవుడు కాలనీలో జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా రూ.229.10 లక్షలతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణంతోపాటు ఆరు కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఇంటికి అంతేకాకుండా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వెనుక ఉన్న దోబీ ఘాట్‌కు రూ.5లక్షలతో పెన్షన్‌ కు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తోట, తదితరులు మాట్లాడుతూ మూడు పర్యాయయాల నుంచి పనిచేస్తూన్న ప్రజాప్రతినిధి కాలనీ అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రతి ఎన్నికలకు ఓటు కోసం నోటు పెంచుకుంటూ వెళ్లారన్నారు. దేవుడు కాలనీకి తాగునీరు అందించడంతో పాటు కాలనీ సమస్యల పరిష్కారానికి కషి చేస్తామన్నారు. కరోనా సమయంలో వాలంటీర్‌ వ్యవస్థతో సిఎం జగన్‌ ప్రజలకు సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు, వైసిపి అధ్యక్షులు పలివెల సుధాకర్‌, వార్డ్‌ మెంబర్లు చిలుకూరి బుజ్జి, వాసురెడ్డి అర్జున్‌, వల్లూరి రామకష్ణ కురుపూడి రాంబాబు, మండల అభివద్ధి అధికారి ఇదం రాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఎజి.రామారావు, భాగ్యరాజు, పంచాయితీ కార్యదర్శి యూ. వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️