ప్రజాశక్తి-రాయచోటి అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని మాసాపేట బ్రిడ్జి వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాష, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లులతో కలసి కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యమకర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయ వాది, నిరంతరం మహిళల విద్యాభివద్ధికి కషిచేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలేను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా, కాంతి రేఖగా నిలిచారని పేర్కొన్నారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కషి చేస్తూ వారి ఆర్థికాభివద్ధికి దోహదపడుతోందన్నారు. బిసి లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని సిఎం జగన్ నిరూపించారన్నారు. 56 బిసి కార్పొరేషన్లకు ఒకేసారి పాలక మండళ్లను ఏర్పాటు చేశారన్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, డిసిసిబి డైరెక్టర్ ఎస్.వెంకట్రామిరెడ్డి, బిసి సెల్ విజయభాస్కర్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షులు గువ్వల బుజ్జిబాబు, నగర ప్రముఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.సుండుపల్లి : మహాత్మాజ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా జ్యోతిరావుపూలే విగ్రహానికి ఎమ్మెల్యే మేడా వెంకటమ ల్లికార్జు నరెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో మొదటిసారిగా మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడని మనమందరం ఆయన అడుగుజాడల్లో నడవా లని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను దోపిడీ వ్యవస్థ అంటరానితనం నుండి విముక్తి చేయడానికి నిరంతరం కషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్ర మంలో సుండుపల్లి మండల అధ్యక్షురాలు, పార్టీ మండల అధ్యక్షులు, జెసిఎస్ కన్వీనర్లు, వైసిపి ప్రజా ప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపిపి, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడు పేర్కొన్నారు. పూలే వర్ధంతిని పురస్కరించుకొని జాళిబజారు లోని పూలే విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా బత్యాల మాట్లాడుతూ జ్యోతి రావు ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాత్ముడని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలని శ్రమించిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. సూర్య, చంద్రులు ఉన్నంత కాలం ఆయన ప్రజల హదయాలలో ఉంటారని, ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక భారతీయుడి బాధ్యత అని తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, పట్టణ అధ్యక్షులు డిఆర్ఎల్ మణి, లీగల్ సెల్ అధ్యక్షులు టి.లక్ష్మీనారాయణ, గుగ్గిళ్ళ చంద్రమౌళి, కొండయ్య నాయుడు, మహిళా నాయకురాలు అనసూయమ్మ, మిరియాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిరావుఫూలే అని లక్కిరెడ్డిపల్లి ఆస్పత్రి అభివద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయభాస్కర్ అన్నారు. లక్కిరెడ్డిపల్లి టౌన్ లోని బాబు స్టూడియోలో ఆస్పత్రి అభివద్ధి కమిటీ సభ్యులు మహమ్మద్‌రఫీ, సదుల్లా, బిసి నాయకులు, కష్ణ తో కలిసి విజయభాస్కర్‌లు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో, మహమ్మద్‌రఫీ, రామచంద్రయ్య, కష్ణ, సాదుల్లా, వెంకటస్వామి, రాము తదితరులు పాల్గొన్నారు.మదనపల్లె: బిసి జనగణన చేపట్టి, బిసిలకు న్యాయం చేసినప్పుడే జ్యోతిరావుఫూలే నిజమైన నివాళి అని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. టిడిపి రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో జ్యోతిరావు చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బల హీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కషి చేసిన మహనీయుడు పూలే అని తెలిపారు. విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కషి చేసిన మహనీయుడని కొని యాడారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కషి చేశార న్నారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్రాయల్, టిడిపి రాజంపేట పార్లమెంటు బిసిసెల్ అధ్యక్షులు పి.సురేంద్రయాదవ్, టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, రాటకొండ మధుబాబు, పూల మురళి, వాల్మీకి సాధికార కన్వీనర్ లక్ష్మన్న, గాండ్ల సాధికార కన్వీనర్ వెంకటరమణ, బెస్త సాధికారిక కన్వీనర్ బొంబాయి దుర్గ, పార్లమెంటు కార్యదర్శి మోహన్ రెడ్డి, ముసలికుంట నాగయ్య, భాస్కర్, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు. బహు జనసేవ ఆధ్వర్యంలో.. బహు బహుజన సేన ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయ కులు శ్రీచందు మాట్లా డుతూ అంటరానితనం, కుల నిర్మూలన వ్యవస్థ, మహిళా పునరుద్ధరణకు మొదటి అడుగు వేసిన ఏకైక సామాజిక సంస్కర్త అని కొనియాడారు. ఆడపిల్లలకు చదువును పంచిన చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే దేశంలోనే మొట్టమొదటి గా బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణ పేదల కోసం పాఠశాల ను స్థాపించిన గొప్ప వ్యక్తిగా జ్యోతిరావు ఫూలే చరిత్రలో నిలిచారని అన్నారు. కుల మతాలకతీతంగా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతకై పనిచేసే ఈ సంఘంలో అన్ని మతాల కులాల ప్రజలు కూడా పాల్గొనచని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన సేన టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర యాదవ్, బహుజనసేన జిల్లా సెక్రటరీ రూపక నాయక్, నవీన్‌నాయక్, బహుజనసేన ఆటో యూనియన్ నాయకులు మహేష్,చలపతి,అమర పాల్గొన్నారు.