కృష్ణా: ఉన్నంతలో పేదలకు ఎంతో కొంత సహాయం చేయడంలోనే ఆత్మ సంతృప్తి ఉందని తానా ఆతిథ్యం కమిటీ ఛైర్మన్ అక్కినేని ఆనంద్ తెలిపారు. కానూరులోని అనాధాశ్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తానా ఆతిథ్యం కమిటీ ఛైర్మన్ అక్కినేని ఆనంద్ ఆధ్వర్యంలో మంగళవారం అనాద బాలలకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి కాలనిలోని పేదలకు , మున్సిపల్ వర్కర్లకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండిస్ట్రెస్ మేనేజర్ సతీష్ బాబు, వాసవ్య మహిళా మండలి చిల్డ్రన్ హోమ్ వార్డెన్ స్వరూప రాణి, , కాకర్ల గంగాధరరావు, పివిఎస్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.