ద్రాక్షారామలో పూలే 133వ వర్ధంతి

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : సామాజిక తత్వవేత్త, కులవ్యవస్థ నిర్మూలనకు పాటు పడిన మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళ్ళోద్దరణకు jఔషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన 133 వ వర్ధంతి సందర్భంగా పూలే ను స్మరించుకోవటం గొప్ప విషయం అన్నారు. పూలే దంపతులు విగ్రహాలుకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . 1873 సెప్టెంబర్‌ 24 న పూలే తన అనుచరులతో కలిసి ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్య శోధక్‌ సమాజ్‌ స్థాపించారని వివరించారు. నూతన పార్లమెంటు ఆవరణ లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనీ, రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోనూ పూలే స్మృతి వనం ఏర్పాటు చేయాలనీ, పూలే జయంతి రోజున ప్రభుత్వం శెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గారోజు సూరిబాబు, ఎర్రం శెట్టి రామరాజు,కొండా రాజు, వై. సుమంత్‌ కుమార్‌, కే. గంగాధర్‌, టీ. బాలు, వేమవరపు రాంబాబు, కనితి రాంబాబు, కానీల వీరభద్రరావు, తదితరులు పాల్గొని పూలేకు ఘనంగా నివాళులర్పించారు.

➡️