మహాత్మా జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి సభ

బాపట్ల : భారతదేశంలో మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘసంస్కర్తలలో జ్యోతిరావు పూలే ప్రముఖులని రావూరి నరసింహ వర్మ కొనియాడారు. మంగళవారం సాహితీ భారతీ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. జ్యోతిరావు పూలే నాడు సంఘంలో ఉన్న దురాచారాలను రూపుమాపటానికి అహర్నిశలు కఅషి చేశారని ఎవరు ఎన్ని రకాలుగా వేధించినాహొ లెక్క చేయక పీడిత ప్రజల కోసం సత్యశోధక్‌ సమాజ్‌ ను స్థాపించారని దీనబంధు అనే పత్రికను కూడా ప్రచురించారన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి రావు మాట్లాడుతూ … ఫూలే సమ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కఅషి చేశారని భారతదేశంలోనే తొలిసారిగా బాలికల విద్య కోసం పాఠశాలను స్థాపించారన్నారు. వారు గులాంగిరి, తఅతీయ రత్న, సర్వజనిక్‌ సత్య ధర్మ పుస్తక్‌ తదితర గ్రంథాలను రచించారన్నారు. బాల్య వివాహాలు వ్యతిరేకించారని వితంతు వివాహాలను ప్రోత్సాహించారన్నారు. ప్రముఖ హిందీ పడితులు అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే కఅషి ఫలితంగానే నేడు కుల మత వర్గ విభేదాలు లేకుండా విద్య అందరకూ అందుబాటులోకి వచ్చిందన్నారు. పూలే భార్య సావిత్రిబాయి పూలే తొలి ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్య కోసం ఎంతో కఅషి చేశారన్నారు . పూలేహొ స్నేహితుడైన షేక్‌ ఉస్మాన్‌, వారి సోదరి ఫాతిమా షేక్‌హొ కూడా పూలే మహిళా విద్య బోధనకు సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ సభలో ఆదం షఫీ ఎన్‌ కఅష్ణ, ఎం.జాకబ్‌ కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్ర మూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళీరాధా కఅష్ణ మూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, తదితరులు జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.

➡️