ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ (కృష్ణా) : కరాటే విజేతలను సిఐ అభినందనందించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా ఆసక్తితో పాల్గొని కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సిఐ నరసింహమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక టైగర్ మరింగ్ అండ్ కరాటే స్కూల్ క్రీడాకారులు విశాఖపట్నంలోని పోర్టు క్రీడా మైదానంలో 24 నుంచి 26 వరకు జరిగిన 19వ డబ్ల్యూకేఐ అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని ప్రతిభచాటి పతకాలు సాధించారు. 13 మంది విద్యార్థులు పాల్గొనగా అందరూ పతకాలు సాధించారని శిక్షకుడు కట్టా సుధాకర్ తెలిపారు. విజేత క్రీడాకారులను, శిక్షకుడు సుధాకర్‌ను సిఐ నవీన్ నరసింహమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.