ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాలిటెక్నిక్ కళాశాలల్లో డి ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సిహెచ్ నాగరాణి సోమవారం విడుదల చేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. 30 నుంచి డిసెంబర్ 2 వరకు విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 4న సీట్ల కేటాయింపు చేస్తామని తెలిపారు. 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 7వ తేదీలోపు ఆయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఫార్మసీ కోర్సుల అడ్మిషన్ల కౌన్సెలింగ్ రెండో దశ సోమవారం పూర్తయినట్లు నాగరాణి తెలిపారు. డి-ఫార్మా, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులకు 9,951 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు. వీరిలో 3,345 మంది నూతనంగా సీట్లు పొందారని వివరించారు. విద్యార్థులు వెంటనే కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.