ఎసిబికి చిక్కిన డిటి, విఆర్‌ఒ

ఎసిబికి చిక్కిన డిటి, విఆర్‌ఒ

ప్రజాశక్తి – కిర్లంపూడి మండల డిప్యూటీ తహశీల్దార్‌, విఆర్‌ఒ రూ.23 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. మండలంలోని సోమరాయణంపేటకు చెందిన రైతు బుద్ధ జయ ఆదినారాయణ లాండ్‌ రికార్డ్‌ పని చేసేందుకు మండల డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాసరావు, విఆర్‌ఒ వై.లక్ష్మీదేవి రూ.23 వేలను డిమాండ్‌ చేశారు. దీంతో ఆ రైతు ఎసిబి అడిషనల్‌ ఎస్‌పి సౌజన్యను సంప్రదించారు. ఎసిబి అధికారులు వేసిన వలలో వారిద్దరూ సోమవారం చిక్కారు. పాలెం గ్రామంలో రూ.23 వేల లంచాన్ని తీసుకుంటుండగా వారిద్దరినీ ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

➡️