ప్రజాశక్తి -గాజువాక : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జివిఎంసి 65వ వార్డులో రూ.79.21 లక్షల వ్యయంతో భానోజీతోట, కెఎల్.రావునగర్, వాంబేకాలనీ, టిఎన్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలువలు, మెట్ల మార్గాలకు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడుతో కలిసి సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవాలు ప్రాంతాల ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, వాటికి అంచనాలు రూపొందించి పనులు చేపడుతున్నామని తెలిపారు. కొండవాలు ప్రాంతాల్లో మెట్ల మార్గం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ డిఇ అప్పారావు, వార్డు నాయకులు మద్దాల అప్పారావు, లోకనాధం, మంగునాయుడు, ఇరోతి గణేశ్ పాల్గొన్నారు.